Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ధర్మారావుపేట గ్రామానికి చెందిన రవళి అనే గర్భిణీ మహిళకు పురిటినొప్పులు రావడంతో అంబులెన్సు కి సమాచారం అందజేశారు. అంబులెన్సు ద్వారా ఆస్పత్రికి తరలించే క్రమంలో నొప్పులు ఎక్కువ కావడంతో మార్గం మధ్యలో అంబులెన్సు సిబ్బంది పురుడు పోశారు. అనంతరం వారిని కాసిపేట పీ.హెచ్.సి కి తరలించారు. ఆడపిల్ల జన్మించిందని తల్లి, బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.