Digital Kasipet:-
కాసిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. కోనూరు గ్రామపంచాయతీ పరిధిలోని నగరం గ్రామానికి చెందిన రైతు, సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు తీర్ధల భాస్కర్ గురువారం కన్ను మూశారు. ప్రైవేట్ బ్యాంకర్ల వేధింపులు, బ్యాంకు నిర్వాహకులే తన చావుకు కారణమని భాస్కర్ తన షర్ట్ పై సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మండలంలోని పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.