Digital Kasipet:-
కాసిపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం సాదాసీదాగా సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ బిల్లులు సకాలంలో రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఎంపీపీ అన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, సహకార చైర్మన్ నీలా రాంచందర్, ఎంపీడీఓ ఎంఏ అలీం, ఎంపిఓ సఫ్ధర్ అలీ, ఎంఈఓ దామోదర్, ఏఓ వందన, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు రాంటెంకి శ్రీనివాస్, వేముల కృష్ణ, వినోద, ఎంపీటీసీ లు పద్మ, మల్లేష్, చంద్రమౌళి, తదితర సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.