Digital Kasipet:-
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామ పంచాయతీ లోని గ్రామాలలో సర్పంచ్ వేముల కృష్ణ అద్యక్షతన ఇంటింటికి కల్వరి మినిస్ట్రీస్ పౌండేషన్ ట్రస్ట్ వారు 250 మందికి చీరలతో పాటు 50 మందికి శాలువాలు పంపిణి చేశారు. ఈ సందర్బంగా సిస్టర్ షారున్ మాట్లాడుతూ చలి తీవ్రంగా ఉండడంతో వృద్దులకు శాలువాలు, నిరుపేదకు 250 వారిని గుర్తించి తమ వంతు సహాయంగా చీరలను, శాలవాలను అందించినట్లు వివరించారు. సేవ చేయడమే బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ లక్ష్యమని, పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని బెల్లంపల్లి కల్వరి మినిస్ట్రీస్ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ సిస్టర్ షారున్ అన్నారు. షారున్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలను విస్తరిస్తమన్నారు. సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ కల్వరి చర్చ్ ఆధ్వర్యంలో ఇప్పడికే చాలా సేవా కార్యక్రమాలు చేశారని, కరోనా నేపథ్యంలో కూడా కల్వరి చేసిన సేవలు మరువలేనివి అన్నారు. కార్యక్రమంలో కల్వరి చర్చ్ నిర్వాహుకులు శ్రీనివాస్, వార్డ్ సభ్యులు కొత్త రమేష్, కొమరక్క, ఇందుమతి, గుర్రం వజ్ర, స్థానికులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.