Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన బిజ్జురి శ్రీనివాస్ (లారీ డ్రైవర్ ) కి మంగళవారం రాత్రి దుబ్బగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించారు. శ్రీనివాస్ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కాసిపేట ఎస్ఐ రాములు తెలిపారు.