Digital Kasipet:-
కాసిపేట మండలం నగరం గ్రామానికి చెందిన లౌడ్య అమ్ములు(21) అనే యువతి కుటుంభంతో కలిసి నగరం గ్రామం నుండి మందమర్రి మండల పులిమడుగు లోని కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్తుండగా మేడారం సమీపంలో గుర్తు తెలియని బోల్లెరో వాహనం ఢీకొనగా యువతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్సు కు సమాచారం అందించి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి పోలీసులు తెలిపారు.