Digital Kasipet:-
2020-21 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్ మరియు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు పక్రియ నేటినుండి ప్రారంభమయ్యాయని ముత్యంపల్లి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ మరియు ప్రధానోపాధ్యాయులు రమేష్ రాథోడ్ తెలిపారు. మొదట ఓపెన్ స్కూల్ సెంటర్ లో అర్హత పత్రాలను సమర్పించి అనంతరం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని పత్రాలను అధ్యాయన కేంద్రంలో సమర్పించి అడ్మిషన్ పొందాలని అన్నారు. ఓపెన్ ఇంటర్ కు ఎస్ఎస్ సీ మెమో, కులం, ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, ఏదైనా వయస్సు ధ్రువీకరణ పత్రం, కులం, రెండు ఫొటోస్ తో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు ఓపెన్ ఇంటర్, పదో తరగతి అధ్యాయన కేంద్రం ముత్యంపల్లి సంప్రదించాలని లేదా 8639049174, 8639648877 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని అన్నారు.