Mancherial:-
మంచిర్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్షట్ పేట్ మండలంలోని కొత్తూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రమ్య పెళ్లి కోసం 15 వేల రూపాయలు మరియు 25 కిలోల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీ రాములు గంగాధర్ చారి, ప్రధాన కార్యదర్శి కట్ట వెంకటేష్ చారి, ప్రచార కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చారి, ఉపాధ్యక్షులు నర్సిం గోజు బాపుచారి, కోశాధికారి కట్ట సత్యనారాయణ చారి, మంచిర్యాల నియోజకవర్గం ఇంచార్జ్ చింతల మహేష్ చారి, లక్షట్ పేట్ మండల్ అధ్యక్షుడు పెద్దపల్లి రమేష్ చారి, పట్టణ అధ్యక్షుడు తోగీటి నరసింహ చారి, కాసిపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి కమలాకర్ చారి, మరియు విశ్వబ్రాహ్మణ సోదరులు పాల్గొన్నారు.