Digital Kasipet:-
వారం రోజుల క్రితం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో నిర్మలపై పులి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చుట్టుపక్కల గ్రామాలలో పులి ఆనవాళ్లు లభించలేదు. తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ శివారులో మైసమ్మ గుట్ట వద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. రోడ్డుపై వెళుతున్న వాహనదారులకు పులి కనిపించడంతో వారు భయంతో బైకులను వదిలేసి పరుగులు తీసారు.