Digital Kasipet:-
రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కాసిపేట మండలంలోని మారుమూల గ్రామాలైన పాత తిరుమలాపూర్, కొత్త తిరుమలాపూర్ గ్రామాలలో ప్రతికుటుంబానికి మనవంతు సహాయం గ్రూప్ వారు దుప్పట్లను పంపిణి చేశారు. అలాగే గ్రామంలోని చిన్నపిల్లలకు స్వేటర్లను అందజేశారు. ఈ సందర్బంగా గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ 100 దుప్పట్లు ఇచ్చి సహాయం చేసిన గురు రాజ్ కృప పెట్రోల్ బంక్ కాసిపేట వారికి ధన్యవాదములు తెలిపారు.