Digital Kasipet:-
పశువులకు బాహ్య మరియు అంతర పరాన్న జీవుల నిర్ములన కొరకు మందులను పంపిణి చేస్తున్నామని, ఈ కార్యక్రమం నేటి నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుందని కాసిపేట మండల పశువైద్యాధికారి డా. తిరుపతి తెలిపారు. ఈ మందులు వేయడం వలన పశువులలో బాహ్య పరాన్న జీవులైన గోమార్లు, పెండ్లు, పిడుదులు అలాగే అంతర పరాన్న జీవులైనా బద్దె పురుగులు, కార్జపు జలగలు, నులి పురుగులు అన్ని రకాల నట్టలు తొలిగిపోతాయని అన్నారు. పశువులు చాలా ఆరోగ్యoగా, ధృడంగా అయ్యి పాలదిగుబడి కూడా పెరుగుతుందని అన్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని స్వద్వినియోగించుకొని వారి పశువులకు ఈ మందులు వేయాలన్నారు. ఈ రోజు ముత్యంపల్లి గ్రామంలో 56 ఆవులకు, 78 గేదెలకు మందుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆడే బాదు హాజరవగా, ఆఫీస్ సబార్డినెట్ రవీందర్, సహాయకుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.