Digital Kasipet:-
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో శనివారం దీప (22 సం,,) అనే మహిళకు పురిటి నొప్పులు రాగా ఆమె భర్త తిరుపతి 108 కి సమాచారం అందించారు. 108 చేరుకొనే లోపు పురిటి నొప్పులు ఎక్కువగా కావడంతో వారి ఇంటి వద్దనే 108 సిబ్బంది ఆత్మరావు పురుడు పోశారు. అనంతరం తల్లి బిడ్డలను కాసిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆమెకి ఇది మూడవ కాన్పు కాగా, ఆడ శిశువు కి జన్మనిచ్చారు. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నారని సిబ్బంది తెలిపారు.