Digital Kasipet:-
కాసిపేట మండలం మేజర్ గ్రామపంచాయతీలోని ZPSS పాఠశాల క్రీడా మైదానంలో గ్రామ పంచాయతీ వారు ఇటీవల హరితవనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాసిపేటలో ఉన్న ఏకైక క్రీడా మైదానం కనుమరుగు కానున్నదని రాబోయే రోజుల్లో పోలీస్, ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులకు ప్రాక్టీస్ కొరకు ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని నర్సరీని వేరే స్థలానికి తరలించాలని మంచిర్యాల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమస్యను పరిష్కరించాలని తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. హరితవనం మార్చలేని పక్షంలో క్రీడా మైదానానికి వేరే స్థలానికైనా కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కాసిపేట సర్పంచ్ మరియు MPO స్పందించి మరొక రెండు మూడు రోజులలో కాసిపేటలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమం లో గొనె శ్రీకాంత్, గుండా రాజకుమార్, రాకేష్,కోట సంజయ్, రత్నం రాజేష్ ఖన్నా, కోట ఆదర్శ, నాగుఱఱపు హరికృష, తదితరులు పాల్గొన్నారు.