Digital Kasipet:-
ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జిల్లా అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున కాసిపేట మండలంలోని అటవీ శివారు గ్రామాలైన దేవపూర్, చింతగూడ, గట్రాపల్లి, సోనాపుర్, వెంకటాపుర్, రొట్టెపల్లి, తిరుమలాపూర్, మల్కేపల్లి, ధర్మారావుపేట, పల్లంగుడ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాసిపేట తహసిల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. అటవీ ఉత్పత్తులకు కొంత కాలం అడవిలోకి వెళ్ళ వద్దని, పశువులను కూడా మేపడానికి అడవి లోకి తీసుకు వెళ్ళ వద్దని ఆయన సూచించారు. అడవి సరిహద్దులోని చేనులకు వ్యవసాయ అవసరాల కోసం వెళ్ళినపుడు ప్రజలు డప్పులతో శబ్దాలు చేస్తూ గుంపులుగా వెళ్ళాలని అన్నారు.