Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమాగూడెం నుండి దేవాపూర్ కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమైంది. నిత్యం భారీ వాహనాలు రాకపోకలు చేస్తూ ఉండడంతో అక్కడక్కడ రోడ్డుపై లోతైన గుంతలు ఏర్పడ్డాయి. దింతో ఆటోలు, ద్విచక్ర వాహనం పై వెళ్లాలంటే ప్రజలు నరకం అనుభవించాల్సి వస్తుంది. రాత్రి పూట రహదారి పై ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా కాసిపేట మైన్ నుండి కొండాపూర్ యాప వరకైతే మరీ అధ్వాహ్నంగా రోడ్డు తయారైంది. రోడ్డు గుంతలుగా ఉండటంతో ప్రమాదాలు జరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని ఎవరు పట్టించుకోవట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.