Digital Kasipet:-
మండలంలోని సోమగూడెం గ్రామంలో రాయల్టీ చెల్లించామని చెప్పి మట్టి తరలిస్తూ భారీ గుంతలు చేస్తున్నారని, అంతేకాక పక్క వారి చెనులో అక్రమంగా మట్టి తవ్వి రవాణా చేస్తున్నారని మండలంలోని ప్రజాప్రతినిధులు మట్టి రవాణాని అడ్డుకున్నారు. మట్టి తవ్విన ప్రదేశంలో ఎం.సి, ఆర్ఐ సర్వే చేసి రాయల్టీ కట్టిన దానికంటే ఎక్కువగా తవ్వారని మరియు అనుమతి లేకుండా ప్రక్క చేనులో మట్టి తవ్వి తీస్తున్నారని రెండు జె.సి.బి లను ఆధీనంలోకి తీసుకున్నారు. మైనింగ్ ఏడి చర్య తీసుకుంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కురి విక్రమ్, ఎం.పి.టి.సి కొండ బత్తుల రాంచందర్, సర్పంచ్ సపోటా శంకర్, తెరాస మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ అజ్మిరా రాజా పాల్గొన్నారు.