Digital Kasipet:-
మండలంలోని కాసిపేట గ్రామంలో మంగళవారం మండల పశువైద్యాధికారి డా. తిరుపతి ఆధ్వర్యంలో మేకలు మరియు గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు తాగించారు. సరియైన సమయంలో నట్టల మందు తాగించడం వలన గొర్రెలు మరియు మేకలు ఆరోగ్యంగా ఉంటాయని, త్వరగా ఎదిగి ఈనుతాయని, రెండు నుండీ మూడు పిల్లలను ఇస్తాయని, పిల్లలు ఆరోగ్యoగా ధృడంగా పెరుగుతాయని రైతులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు తమ గొర్రెలకు, మేకలకు నట్టల మందు త్రాగించాలని కోరారు. ఈ రోజు కార్యక్రమంలో 860 గొర్రెలకు మరియు 720 మేకలకు మందుల పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సబార్డినెట్ రవీందర్ , సిబ్బంది సాయికిరణ్ పాల్గొన్నారు.