Digital Kasipet:-
కాసిపేట మండలం నుండీ IIIT కి ఎంపికైన ఇద్దరు విద్యార్థులు బానోత్ వెంకటేష్, నాయిని వర్షిత లను తెలంగాణ జాగృతి కాసిపేట మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా పరీక్షల విభాగం మరియు కాసిపేట మండల విద్యాధికారి దామోదర్ రావు, తెలంగాణ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు, జాగృతి మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి పత్తి సత్తయ్య, జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో జాగృతి సభ్యులు మల్లేశం, చిక్రం రాం దాస్, కాసిపేట మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య, ఉపాధ్యాయులు సౌజన్య, స్రవంతి, పద్మజ, కిషన్, శ్రీనివాస్ గౌడ్, విజయ్ రావు పాల్గొన్నారు.