Digital Kasipet:-
మంచిర్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి
మన వంతు సహాయం సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం పెద్దపెల్లి జిల్లా NTPC ఇందిరమ్మ కాలనీ కి చెందిన దివ్య పెళ్లి కోసం దాతల సహాయంతో 15,116 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి జిల్లా ప్రచార కార్యదర్శి గొల్లపల్లి రాజేందర్ చారి, కాసిపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి కమలాకర్ చారి, మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జి చింతల మహేష్ చారి, లక్షట్ పేట్ మండల అధ్యక్షుడు పెద్దపల్లి రమేష్ చారి, మందమరి మండల అధ్యక్షుడు ఎర్రోజు రమేష్ చారి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి సహకరించిన వారికీ ధన్యవాదాలు తెలిపారు.