Digital Kasipet:-
కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టిన బంద్ కు మద్దతుగా కాసిపేట మండలంలోని తెరాస, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. సోమగూడెంలో వ్యాపారాలు స్వచ్చందంగా బందు లో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. అలాగే జాతీయ రహదారి మీద కూర్చొని వాహనదారులని కూడా రైతు లకి మద్దతు గా బంద్ పాటించాలని కోరారు. కాసిపేట మరియు కొండాపూర్ గ్రామాలలో ప్రధాన రహదారిపై తెరాస శ్రేణులు పెద్దఎత్తున సంఘటితమై రైతు చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.