Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో స్వర్గీయ పుస్కూరి వెంగళరావు మరియు పుస్కూరి నర్సింగరావు స్మారకార్ధం క్రికెట్ టోర్నమెంట్ బుధవారం రోజున మండల పరిషత్తు అధ్యక్షురాలు రొడ్డ లక్ష్మి రమేశ్, ఉపాధ్యక్షులు పుస్కూరి విక్రంరావు, కాసిపేట మండలం తెరాస అధ్యక్షులు రమణారెడ్డి దీపం వెలిగించి క్రికెట్ పోటీ ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో, యంపిటిసిలు అక్కెపెల్లి లక్ష్మి, చంద్ర మౌలి, కాసిపేట తెరాస ప్రెసిడెంటు బొల్లు రమణారెడ్డి, సర్పంచ్లు ఆడె భాదూ, శ్రీనివాస్, ఉపసర్పంచ్లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, తెరాస కార్యదర్శి మోటురి వేణు, తెరాస పార్టీ ఉపాధ్యక్షులు అగ్గి సత్తయ్య, ఒసిసి యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంటు తిరుపతిరెడ్డి, రైతు సంఘం అధ్యక్షులు దుర్గం పొశం, మార్కెట్ కమిటీ డైరెక్టరు రామటెంకి వాసుదేవ్, సింగిల్ విండో డైరెక్టరు సురేందర్, తెరాస నాయకులు, క్రీడా కారులు తదితరులు పాల్గొన్నారు.