Digital Kasipet:-
కళ్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కాసిపేట మండలంలోని నాయకులు వోల్వో, డంపర్లును ఆపి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు అధికారి పద్మనాభరెడ్డి స్పందించి త్వరలోనే స్థానికులు కోరిన డిమాండ్లను తీరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్, ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, స్థానిక సర్పంచ్ సపాట శంకర్, ఉపసర్పంచ్ కనుకుల రాకేష్, నాయకులు భూక్య చందూలాల్ ,భూక్య రామచందర్, మర్రి సంతోష్ , భీమయ్య, స్థానికులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.