Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన జంబోజు తిరుపతి కూతురు గాయత్రి గత కొద్దీ కాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నది. ఇప్పటివరకు రూ 3,00,000 ఖర్చు చేశామని, చికిత్స చేసే ఆర్థిక స్థోమత లేదంటూ తమకు సహాయం చేయమని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూప్ ల ద్వారా తెలిపారు. ఈ విషయం తెలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని మెరుగైన చికిత్స కోసం తక్షణమే హైదరాబాద్ కి రావాలని సూచించారు. అదేవిధంగా చికిత్సకు ఖర్చయ్యే పూర్తి ఖర్చులు తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.