Digital Kasipet:-
యువతకు 2లక్షల ఉద్యోగాలను కల్పించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,016 ఇవ్వాలని, ప్రైవేట్ టీచర్లకు 9 నెలల గౌరవ వేతనం చెల్లించాలని BJYM ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం కాసిపేట తహసీల్దార్ భూమేశ్వర్ కి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కాసిపేట మండల అధ్యక్షులు కాల్వ సతీష్ రెడ్డి, BJYM మండల అధ్యక్షులు మాదాసు సురేష్, మండల పాదాదికారులు, యువ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.