Digital Kasipet:-
గత కొద్ది రోజులుగా కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామంలో జరుగుతున్న మట్టి రవాణాను స్థానికులు మరియు ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మైనింగ్ ఏడి బాలు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ సర్వే నిర్వహించి రాయల్టీ కట్టిన దాని కంటే ఎక్కువగా తవ్వారు అని, అనుమతి లేకుండా పక్క చేనులో తవ్వారని తేల్చారు. వారి రాయల్టీ పర్మిషన్ క్యాన్సల్ చేసి వారికీ 14 లక్షల 50వేల రూపాయలు జరిమానా విధించడంతోపాటు రెండు జేసీబీ లను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీటీసీ కొడబత్తుల రాంచందర్, సర్పంచ్ సపాటు శంకర్, ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, నాయకులు భుక్య రాంచందర్, అగ్గి సత్యం పాల్గొన్నారు.