Digital Kasipet:-
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తున్న కాసిపేట మండల బీజేపీ నాయకులను దేవాపూర్ పోలీసులు సోమవారం ఉదయం 6 గంటలకు ముందస్తు చర్యలో భాగంగా అరెస్ట్ చేసారు. అరెస్ట్ అయినా వారిలో బీజేపీ మండల అధ్యక్షుడు కాల్వ సతీశ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మనోజ్ దాస్, రాజన్, బీజేవైఎం మండల అధ్యక్షుడు మాదాసు సురేష్, మండల ముఖ్య సలహాదారుడు మాదాసు శంకర్ ఉన్నారు.