Digital Kasipet:-
కాసిపేట మండలంలోని పోలింగ్ కేంద్రాలలో ఈరోజు మరియు రేపు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నారు. 2020 జనవరి 1 నాటికీ 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఫారం 6 నింపి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చు. కొత్తగా ఓటు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు అనగా పేరు మిస్టేక్ ఉన్నవారు, పెళ్లి అయిన యువతులు అడ్రస్ మార్పు కోసం, కుటుంబంలో మరణించిన వారు ఉంటే వారి పేరు తొలగింపు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకోసం మీ పోలింగ్ బూత్ అధికారిని సంప్రదించండి.