Digital Kasipet:-
కాసిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేయబడి నిల్వ ఉన్న ఇసుకను ఈనెల 23వ తేదీన వేలంపాట నిర్వహించనున్నట్లు కాసిపేట తహసిల్దార్ భూమేశ్వర్ తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొని ఇసుకని పొందగలరని అన్నారు.