Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమగూడెం భరత్ కాలనీ క్రీడా మైదానంలో గురువారం నెహ్రూ యువ కేంద్రం ఆదిలాబాద్ ద్వారా ప్రజా సేవా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేమ్స్ ఇండియా ట్రస్ట్ అందిస్తున్న ఎనర్జీ డ్రింక్ ను వాలీబాల్, ఫుట్ బాల్ క్రీడాకారులతో పాటు వాకర్స్ కు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, సర్పంచ్ కొరుకొప్పుల ప్రమీలా గౌడ్ హాజరు కాగా వారి చేతుల మీదుగా క్రీడాకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ యువ కేంద్రం ద్వారా క్రీడాకారులకు ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేయడం హర్షించతగ్గ విషయమన్నారు. క్రీడాకారులకు కిట్లు కూడా అందిస్తామని చెప్పడం సంతోషమన్నారు. క్రీడాకారులు, వాకర్స్ తమకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులను కోరడంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొండబత్తుల రాంచందర్, నెహ్రూ యువ కేంద్రం ఉమ్మడి జిల్లా వాలంటరీ గజెల్లి ముకేష్ చంద్ర, నాయకులు భూక్య రాంచందర్, బానోత్ రాజేష్, గ్రామ అధ్యక్షులు చింతల భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ అలుగo సురేష్, వాలీబాల్ కోచ్ బానోత్ రాజేష్, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బోగే రామకృష్ణ, మహేందర్, దుస్స కుమార్, రాజేశ్వరరావు, ప్రజా సేవా యూత్ అసోసియేషన్ వాలంటరీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు పేరాల మహేష్, శ్రీధర్, క్రీడాకారులు, వాకర్స్ పాల్గొన్నారు.