Digital Kasipet:-
కాసిపేట మండలంలో ఈ రోజు శనివారం మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి నారయణ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. మల్కేపల్లి, తాటిగుడా, కాసిపేట మరియు సోమగూడెం గ్రామపంచాయతీ లలో శ్మశానవాటిక నిర్మాణ పనులు మరియు నర్సరీ నిర్వహణ, పల్లే ప్రకృతి వనం లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలమేరకు మిగిలి ఉన్న పనులను 15 రోజులలో పూర్తి చేయాలని సర్పంచులను ఆదేశించారు. పారిశుధ్య పనులు, పన్నుల వసూళ్లు ఈ నెల ఆఖరు వరకు 100% పూర్తి చేయాలనీ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. సోమగూడెం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య ఏర్పడిన విబేధాలపై ఇరువురితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పనులు చేయాలనీ లేదంటే ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని వారికీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీ ఫానిందర్ గారు, ఎంపీడీఓ ఎంఏ అలీం, మండల పంచాయతీ అధికారి శ్రీ షేఖ్ సఫ్ధర్ అలీ, గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్ లు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.