Digital kasipet:-
కాసిపేట మండల కేంద్రంలో శనివారం మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గడ్డం వినోద్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలలో బెల్లంపల్లి నియోజకవర్గంలో తనకు 44 వేల పైగా ఓట్లు వేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని, ఏదేనా సమస్య ఉంటె తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. తాను బెల్లంపల్లి ఎమ్మెల్యే గా గెలిచుంటే చెన్నూరులో చేసినట్లుగా బెల్లంపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి చేసేవాడినని, అలాగే బెల్లంపల్లిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ఆయే విధంగా కృషి చేసేవాడినని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నాయని, వీటిని రైతులకు వివరిస్తూ రైతులనుండి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి ముందు బైకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ మునిసిపల్ చైర్మన్ సూరన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం ప్రదీప్, రాంచందర్, బన్న ఆశాలు, రాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.