Digital Kasipet:-
లయన్స్ క్లబ్ అఫ్ సోమగూడెం వారు పేద కుటుంబానికి చెందిన ఆడపిల్ల వివాహానికి పెళ్ళికి కావాల్సిన వంట సరుకులను అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. కాసిపేట మండలం సోమగూడెం( కే) గ్రామ పంచాయతీలోని పెంటపర్తి సుజాత కూతురు వివాహం డిసెంబర్ 2 వ తేదీన జరగనుంది. వారి ఆర్థిక పరిస్థితిని స్థానికులు లయన్స్ క్లబ్ వారికి తెలపగా క్లబ్ సభ్యులు స్పందించి అమ్మాయి వివాహనికి 50 కిలోల బియ్యం, మరియు పప్పులు, చక్కెర, నూనె, సబ్బులు, తదితర సమాన్లు అందజేశారు. క్లబ్ అధ్యక్షుడు తీర్థాల భాస్కర్ మాట్లాడుతూ ఇలాంటి పేదలు ఇబ్బందులు పడే వారికి లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పాముల దినేష్,గొంది వెంకటరమణ, (PMJF) పాస్ట్ కార్యదర్శి పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ, ఉపాధ్యక్షుడు దూడం మహేష్ లతో పాటు పెండ్లి కుమార్తే మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.