Digital Kasipet:-
లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ డి. కే రాజలింగం కుమారుడు శశికుమార్ పుట్టినరోజు సందర్బంగా కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల నాయకపుగూడ గ్రామంలో లయన్స్ క్లబ్ అఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో వృద్దులకు షుగర్ పరీక్షలు నిర్వహించారు. అలాగే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని 25 మంది గిరిజన వృద్దులకు దుప్పట్లు మరియు మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కట్కూరి సత్యనారాయణ, లయన్స్ క్లబ్ పి.ఆర్.ఓ & పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తీర్థాల భాస్కర్, కోశాధికారి దినేష్, దూడం మహేష్, మేడ సమ్మయ్య, గ్రామ పెద్దలు సోమని రాజం, భూనేని రాజు, నవీన్ లు పాల్గొన్నారు.