Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వెంకటాపూర్ గ్రామంలో పశువైద్య శిబిరం

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో సోమవారం మండల పశువైధ్యాధికారి తిరుపతి పశువైద్య శిబిరం నిర్వహించి 258 ఆవులకు కుందేటి వెర్రి వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ వ్యాధి ట్రీపానాసోమా బోవిస్ అనే రక్తపు పరాన్న జీవి వలన పశువులకు సోకుతుందని, గుడ్డి ఈగ ద్వారా ఒక ఆవు నుండి వేరొక అవుకు విస్తరించుతుందని రైతులకు వివరించారు. ఈ వ్యాధికి వాక్సిన్ లేదని, వ్యాధి వచ్చిన పశువులకు సకాలంలో వైద్యం అందిస్తే నయం చేసే అవకాశం ఉంటుందని అన్నారు. రైతులు తమ పశువుల పాకలను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేయడం ద్వారా ఈగలను నివారించి తద్వారా ఈ వ్యాధిని రాకుండా చేయవచ్చని తెలిపారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App