Digital Kasipet:-
అక్రమంగా మట్టి తరలింపును నిలిపివేయాలని సోమగూడెం గ్రామ ప్రజలు మట్టిని తరలించిన ప్రాంతంలో ఫ్లకార్డుతో నిరసన తెలిపారు. ఏజెన్సీ గ్రామపంచాయితీలో చట్ట విరుద్ధంగా మట్టిని తరలిస్తుంటే అదికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. మైనింగ్ AD, మరియు స్థానిక రెవిన్యూ అధికారులు తవ్వడం తప్పేనని అంటున్నా బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. ఇంటి అవసరం కోసం రెండు ట్రాక్టర్ల మట్టి తీసుకువెళ్తేనే సదరు వ్యక్తికి రూ.70.000 పెనాల్టీ వేసిన అధికారులు ప్రస్తుతం జరుగుతున్న బాగోతం కన్పించడం లేదా, సామాన్యులకేనా పెనాల్టీలు? పెద్దవాళ్లకు వర్తించవా? అని ప్రశ్నింస్తున్నారు. మట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, అలాగే మట్టి తరలించడం వల్ల ఏర్పడిన గుంతలను పూడ్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, అజ్మీరా రాజా, లక్ష్మణ్, సంకే రవి, జి.రాజు, రవి, వంశీ వెంకటేష్, అభిద్, ప్రశాంత్, సాగర్, సాయి, ప్రణయ్ పాల్గొన్నారు.