Digital Kasipet:-
కార్తీక మాసం పురస్కరించుకుని కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం కొత్త కాలని లో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. పంచముఖ ఆలయ ప్రాంగణంలో 600 పైగా దీపాలతో పెద్ద ఎత్తున గ్రామ మహిళ భక్తులతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో చేయబోయే పంచముఖ ఆలయ విగ్రహముల ప్రతిష్ఠి కోసం గ్రామ ప్రజల సహాయసహకారాలు ఎంతో అవసరం అన్నారు. అందరు కలిసికట్టుగా గుడి నిర్మాణం పూర్తి చేసుకోవడానికి సహకారాన్ని అందివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, అయ్యగార్లు శ్రీకాంత్ పాండే, రవి పాండే, సంతోష్ పాండే లు పాల్గొని అర్చన, అభిషేకములు నిర్వహించారు.