Digital Kasipet:-
కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామంలో KK2 OC ప్రభావిత ప్రజలకు మరియు భూములు కోల్పోయిన వారికీ న్యాయం చేయాలనీ గ్రామా సర్పంచ్ సాపట్ శంకర్ మందమర్రి G.M ని కలిసి గ్రామపంచాయతీ తరుపున వినతివత్రాన్ని అందజేశారు. ఓపెన్ కాస్ట్ ప్రారంభం కొరకు ప్రజాభిప్రాయ సేకరణ జరిపే సందర్భంలో సింగరేణి యాజమాన్యం హామీలు ఇచ్చి ఇంకా నెరవేర్చలేదని అన్నారు. OC ప్రభావిత ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, భూములు కోల్పోయిన వారికీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.