Digital Kasipet:-
రబీ పంట కాలానికి రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఫర్టిలైజర్ యజమానులను వ్యవసాయాధికారి వందన ఆదేశించారు. గురువారం మండలంలోని దేవాపూర్ గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. పంట పండించే రైతులకు మాత్రమే ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని వారికి సూచించారు.