Digital Kasipet:-
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సోమగూడెం కొత్త కాలని లో మంగళవారం సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో 10 లక్షల విలువగల సి. సి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీటీసీ రాంచందర్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమని మైసక్క, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, వార్డు సభ్యులు కొత్త రమేష్, బన్న హిందూమతి, పంబాల తిరుపతి, కంచర్ల పద్మ, కుంట రాజశేఖర్, బొల్లపెల్లి కొమురక్క, కో ఆప్సన్ సభ్యులు గుర్రం వజ్ర, జీదుల కనకయ్య, గ్రామ పెద్దలు కూకట్ల దేవెందర్, నందికొండ శ్రీధర్, భూనేని రాజు, తదితరులు పాల్గొన్నారు.