Digital Kasipet:-
బలహీన వర్గాల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా కన్వీనర్ గా కాసిపేట మండలానికి చెందిన గొల్లపల్లి రాజేందర్ ని రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ రాములు ఈరోజు నియమించారు. అలాగే కో కన్వీనర్ గా చింతల మహేష్ చారి, శ్రీ రాముల గంగాధర్ చారి లను ఎన్నుకొని వారికీ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సలహాదారు ప్యాట శంకర్, సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు మరియు అమరేశ్వర్ పాల్గొన్నారు.