Digital Kasipet:-
కాసిపేట మండలం సోమగుడెం (కే) గ్రామ పంచాయతీ పరిధిలోని ట్యాంక్ బస్తిలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న మట్టి అక్రమ రవాణను ఆపివేయించి, బాద్యలపైన కఠిన చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కార్యాలయంలో సోమగుడెం(కే) ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, యూత్ సభ్యులు అజ్మీరా రాజా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ శివారులోని భూమిలో నుంచి భారీ ఎత్తున అక్రమణదారులు మట్టిని తరలించడం మూలంగా పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగ మారిందన్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్, మైనింగ్ AD గార్లకు గతంలో తెలియపర్చిన బాద్యులపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 2 నెలల క్రితం ఇదే బస్తీకి చెందిన వ్యక్తి తమ ఇంటి చుట్టు ఉన్న బొందను పూడ్చడానికి రెండు ట్రాక్టర్ల మట్టి తీసుకెళ్లినందుకు పెనాల్టీ వేసిన అధికారులు ప్రస్తుతం పెద్దఎత్తున లారీలతో మట్టి తరలిస్తుంటే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇకనైన అక్రమార్కులపై చర్యలు తీసుకొని గుంతలను పూడ్చాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజెయ్యడం అన్నారు.