Digital Kasipet:- కాసిపేట మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో శనివారం 67 వ అంతర్జాతీయ సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం pacs చైర్మన్ నీల మాట్లాడుతూ రైతులకు సకాలంలో పంటలకు ఎరువులను పంపిణి చేసి రైతులకి ఏ ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఈ సందర్బంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కూరి విక్రమ్ రావు, సర్పంచ్ ఆడే బాదు, ఉపసర్పంచ్ లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, అగ్గి సత్యం, రాంచందర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.