Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గర్భిణికి పురుడుపోసిన 108 సిబ్బంది

Digital Kasipet:- 
కాసిపేట మండలంలోని మల్కాపెల్లి గ్రామానికి చెందిన ఆత్రం జ్యోత్స్న అనే గిరిజన మహిళకు శుక్రవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో అవస్థ పడుతుండడంతో భర్త శ్రీనివాస్  108 కి సమాచారం అందజేశారు. 108 ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో  మార్గం మధ్యలో దుబ్బగూడెం ప్రాంతం లో నొప్పులు ఎక్కువగా కావడంతో 108 సిబ్బంది దుర్గం ఆత్మరావు గర్భవతికి ధైర్యం చెప్పి వాహనంలోనే పురుడు పోశాడు. అనంతరం తల్లి, బిడ్డలను 108లో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకి ఇది రెండవ కాన్పు కాగా, మగ శిశువుకి జన్మనిచ్చింది.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App