Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

బాలికలపై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడాలి

Digital Kasipet:-
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కాసిపేట మండలంలోని సోమగూడెం గ్రామంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో బాలికలకు పండ్లు మరియు పెన్నులు, బుక్స్ పంపిణీ చేసారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ పి.ఆర్.ఓ వేముల కృష్ణ మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో నానాటికి బాలికల పై జరుగుతున్న దురాగతాలకు వ్యతిరేకంగా ప్రతి వారు పోరాడాలని, అలాగే బాలికలు కూడ జాగ్రత్తగా సమాజంలో ప్రతి వ్యక్తి దగ్గర ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు తీర్థాల భాస్కర్, కార్యదర్శి పాముల దినేష్, సభ్యులు దూడం మహేష్, మేడ సమ్మయ్య పాల్గొన్నారు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App