Digital Kasipet:-
చేగువేరా 53 వ వర్ధంతి సందర్భంగా కాసిపేట మండలం సోమగూడెం గ్రామంలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలను నాటారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశాన్ని మరియు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు పర్యావరణానికి విఘాతం కల్పించే విధంగా వ్యవహరిస్తున్నారని, దీని ఫలితంగా రోజురోజుకు కాలుష్యం పెరుగుతుందని మండిపడ్డారు. అదే విధంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పరిపాలనలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు సంకె రవి, ఉపాధ్యక్షులు కనుకుల రాకేష్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మరియు సంఘ నాయకులు అజ్మీర శ్రీనివాస్, వినోద్, సాయి గార్లు పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం
Digital shivaOctober 09, 2020