Digital Kasipet:-
కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోండు గూడ గ్రామంలో చిరుత పులి చర్మం అమ్మడానికి ప్రయత్నించినా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. పల్లంగూడా శివారు అడవిలో దాచి ఉంచిన పులిచర్మాన్ని బైకు మీద యాప వైపు తీసుకొని వెళ్తుండగా ముందస్తు సమాచారం మేరకు రామగుండం టాస్క్ ఫోర్స్ మరియు దేవాపూర్ పోలీసులు నాయకపు గూడ వద్ద వాహనాన్ని తనిఖీ చేసారు. తనిఖీలో పులి లభించగా చర్మాన్ని స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్ చేసారు. పోలీసులు మాట్లాడుతూ మొత్తం ఆరుగురు నిందితులను పట్టుకున్నామని, ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో అడవులను నరకకుండా, అక్రమ రవాణా జరగాకుండా, వన్యప్రాణులను వేటాడకుండా పోలీస్ నిఘా ఉంచుతున్నామన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ లో స్పెషల్ బ్రాంచ్ సీఐ జి. సతీష్ టాస్క్ ఫోర్స్ సిఐ కిరణ్ మరియు ఎస్ఐ దేవాపూర్ దేవయ్య, టాస్క్ ఫోర్స్ ఎస్సై లు లచ్చన్న, సిహెచ్ కిరణ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పులిచర్మం కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్
Digital shivaOctober 29, 2020