Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సింగరేణి ఆధ్వర్యంలో మౌళిక సదుపాయాలు కల్పించాలి

Digital Kasipet:-
స్వచ్చత మహా స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా సింగరేణి కాలరీస్ జనరల్ మెనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు ముత్యంపల్లి గ్రామంలో మొక్కలను నాటారు. అనంతరం మాట్లాడుతు గ్రామంలో ఉన్న  గ్రౌండ్ చుట్టూరా చెట్లు నాటితే  ఛాలా అందంగా ఉంటుందని అన్నారు. గ్రామంలొ ఏదైన సమస్య ఉంటె తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని అన్నారు. జడ్పీటీసీ పల్లె చంద్రయ్య మాట్లాడుతూ గ్రౌండ్ కి పెన్షన్ వెయించాలని కోరగా,  వైస్ ప్రెసిడెంటు విక్రంరావు మరియు సర్పంచ్ ఆడె బాదు మాట్లాడుతూ సింగరేణి వారు గ్రామంలో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. దీనికి స్పందించిన జీఎం శ్రీనివాసరావు గ్రామ సభ తీర్మానం పంపిస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం జీఎంను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండాబత్తుల రాంచందర్, కో ఆప్షన్ మెంబెర్ సిరాజ్ ఖాన్, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, తెరాస కార్యదర్శి మోటురి వేణు, పిఎసిఎస్ డైరెక్టర్ సురేందర్, వార్డ్ మెంబైర్లు సందీప్, గంగా,  విజయ, సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నరు.

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App