Digital Kasipet:-
కాసిపేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ లో గత నలభై సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న శ్రీ రొడ్డ రమేష్ (మాజీ సర్పంచ్ మరియు మాజీ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి) మరియు రొడ్డ రాజం (గ్రామ పెద్ద మనిషి) నిన్న పదవి విరమణ పొందారు. వీరిద్దరిని ఓరియంట్ సిమెంట్ గుర్తింపు సంఘం అధ్యక్షులు రాంమోహన్ రావు, కార్మిక సంఘం నాయకులు గురువారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు.