Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

జేఈఈ లో సత్తా చాటిన విద్యార్థికి సన్మానం

Digital Kasipet:-
వారిది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే చదువుని అపి, తరువాత ఓపెన్ స్కూల్ లో పదోవతరగతి పూర్తి చేశాడు... దుర్గం అభిలాష్. మొన్న విడుదల జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అభిలాష్ ఉత్తమ ప్రదర్శన కనుబరచడంతో ఈరోజు మంచిర్యాల జిల్లా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అతను చదివిన సోమగూడెం లంబాడి తండా ఓపెన్ స్కూల్లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జాగృతి అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు,  పాఠశాల హెచెం నెన్నెల లచ్చయ్య, పిఆర్ఓ చిందం చిన్నయ్య, కో కన్వీనర్లు బండారి లస్మయ్య, మద్ది లక్ష్మణ్, బెల్లంపల్లి నియోజకవర్గ కన్వీనర్ సిడం శంకర్, కాసిపేట మండల జాగృతి అధ్యక్షులు సోదారి సురేష్ , జాగృతి నాయకులు బాణావత్ ప్రకాష్ నాయక్,  అరుణ్, రమేష్, సురేష్ పాల్గొన్నారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App