Digital Kasipet:-
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో శనివారం మంచిర్యాల జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి నరేందర్ ఆకస్మికంగా పర్యటించి గ్రామంలో జరుగుతున్న పనులను తనిఖీ చేశాడు. ఇందులో భాగంగా ఇండ్ల నమోదు సర్వేను పరిశీలించారు. అలాగే గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక మరియు పల్లె పకృతి వనం పనులను పరిశీలించి దసరా లోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఆయన వెంట కాసిపేట మండల MPO షేక్ సఫ్ధర్ అలీ, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి ఉన్నారు.